Verse 1
మమ్మావరించియున్న మా రక్షణకర్తా
కొనసాగించుచున్న మా ఆత్మలనేత
కృతజ్ఞతా పూర్వకమైన హృదయారాధనను
ఆత్మతో సత్యముతో స్తోత్రారాధనను
చూపునుంచి-సంచరించి-స్తుతులను స్వీకరించి-ధన్యులజేయుము
Verse 2
మన్ను నిన్ను స్తుతించలేదని - మృతులు స్తుతులు చేయలేరని
నన్ను సృజియించి - జీవమునుపోసి - విడుదలిచ్చింది నీవని
యాగమును చేసి, పాపమును తీసి - విడుదలిచ్చింది నీవని - 2
గాయపడిన నీ పదములపై - వ్రాలిచేయు ఆరాధనపై ||చూపునుంచి ||
Verse 3
సన్నుతించుటే మేలని - స్తుతులె నీకు శ్రేష్టబలియని
ఉదయమందైన సాయంవేళైన రాత్రి యేజాము గడవనీ
సాష్టాంగపడి కీర్తనలు పాడి కొలుతు నాకర్త నీవని
త్యాగమైన నీజీవమును నింపిచేయు ఆరాధనపై ||చూపునుంచి ||