Verse 1
అయ్యో! సువార్తను ప్రకటించక పోయినయెడల
నాకు శ్రమ - నీకు శ్రమ - మనకందరికీ శ్రమ - 2
Verse 2
స్తెఫనుడు నియమింపబడినదెందుకు
జ్ఞానాత్మలతో నింపబడినదెందుకు
కృపాబలము నిండ ఆత్మశక్తితోడ
దూతలా ప్రకాశించెనెందుకు
హతసాక్షిగా మోదబడినదెందుకు? ఎందుకు? ||అయ్యో ||
Verse 3
ప్రభునిస్వరం పౌలు విన్నదెందుకు
సేవకునిగా తీర్చబడినదెందుకు
శ్రమలోన మ్రగ్గుతూ శ్రమలకు తలఒగ్గుతూ
పరుగును తుదముట్టించినదెందుకు
జీవమకుట సిద్ధిపొందినది ఎందుకు? ఎందుకు? ||అయ్యో ||
Verse 4
రక్తమిచ్చి కొన్నది నిన్నెందుకు
తనశక్తి పొందమని కోరినదెందుకు
మారుమాట మాని తీర్మానము బూని - 2
సజీవయాగమై పోయేందుకు
సువార్తను ప్రకటించగ రా ముందుకు! ముందుకు ! ||అయ్యో ||