Verse 1
నా నాధుడేసు నా నావికుడేసు
నా చిన్న దోనెను నడిపించునేసు
నా గమ్య మేసు ఆధారమేసు యేసు యేసు నీవే యేసు
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయ హోసన్న హల్లెలూయ...
Verse 2
నేలనున్న నోవహు ఓడను - నీటిపై తేలియాడ చేసె
నావికుడే లేని ఆ నావకు - నీవే నావికుడవయ్యావు
కొండల నెక్కించి లోయలు దాటించి
ఆగాధ జలములపై అద్భుతముగా నడిపావు
ఉన్నత శిఖరముపై భద్రముగా నిలిపావు ||యేసు ||
Verse 3
చెలరేగిన పెను తుఫాను గాలిలో - చిక్కిన ఆ చిన్న దోనెలో
నిదిరించుచున్న నా యేసువా - నీవెవరవో నేనెరుగుదునయ్యా
అసాధ్యమైనది నీకేది లేదుగా - నా జీవన నౌకలో నీవున్న చాలు ||యేసు ||
Verse 4
నీదరికి నే చేరితినయ్యా - అద్దరికి నను చేర్చుమయ్యా
నా తలపైకెత్తిన యేసయ్యా - నా బలము గానము నీవయ్యా
పలు నిందలు అలలు కలవరపరచిన - శోధన బాధలు సుడి గాలులైన
నాధుడ నీవున్న భయమేలనయ్యా ||యేసు ||