Verse 1
మరువలేదు - మరువలేదు - 2
నిన్ను మరచిన - నన్ను నీవు - 2
మరువలేదయ్యా - 2 || మరువ ||
Verse 2
కన్య మరువదు ఆభరణం - వధువు మరువదు వడ్డాణం - 2
లెక్కలేని దినములెన్నో - నిన్ను మరచిరి నీదు జనులు - 2 ||మరువ ||
Verse 3
జన్మనిచ్చిన తల్లి తానే - స్తన్యమియ్యక వదిలె సుతుని - 2
నిమిషమైన మరువలేక - ఆదుకొంటివా మోషేనపుడు - 2 ||మరువ ||
Verse 4
నిన్ను మరచి చెరలోనున్న - నన్ను వీడక ధరణికేగి - 2
పాపమరణ ముల్లు విరువ - సిల్వ కొరిగితివా మాతండ్రి - 2 ||మరువ ||
Verse 5
నిన్ను చేరి కొలుచు నాపై - నిమిష నిమిషము మోపె నేరము
రక్తమను తెర చాటుచేసి అప్పగించలేదే వైరికి - 2 ||మరువ ||