Verse 1
ఆకాశం భూమి అన్నీ మారిపోయిన
పర్వత శిఖరములన్నీ తొలగిపోయిన
కొండలు గుట్టలన్నీ కరిగిపోయిన
ఎన్నటికి మారనేరదు యేసుని ప్రేమ
ఎప్పటికి వీడిపోదు - 2
Verse 2
కన్నతల్లి ప్రేమ కనుమరుగైపోయిన
బంధుమిత్రుల ప్రేమ బహుదూరమైన - 2
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నది
నిస్వార్ధ ప్రేమతో నీకై ప్రాణమునే అర్పించినది - 2 ||ఎన్నటికి ||
Verse 3
దిక్కులేని నన్ను మక్కువతో చేరినది
చక్కని మార్గములో నడిపించుచున్నది - 2
లెక్కలేని కృపలు మిక్కిలిగా కురిపించి
పరలోకానికి నాకు హక్కును కల్పించినది - 2
పక్షపాతము లేనిది నా యేసుని ప్రేమ
నా పక్షముగా నున్నది - 2 ||ఆకాశం ||