Verse 1
తప్పిపోయిన కుమారుడనయ్యా
తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా
కాదనకయ్యా నా కన్న తండ్రి
తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2)
Verse 2
అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని
పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2)
ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా
ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా||
Verse 3
పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు
పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2)
ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా
తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా||