Verse 1
ఆకాశమా వినుడి - మేఘమండలమా వినుడి
కాలం మారిన ఋతువులు మారిన మారదు శుభవచనం
క్రీస్తేసుని చాటెదము జనులారా పాడెదము
అనుదినమీ శుభవచనం || ఆకాశమా ||
Verse 2
సాగరమా అలలారా కీర్తించుడి
భూమండలమా దేవుని స్తుతించుడి - 2
నిలుచును శాంతిగ మారని వచనం
ప్రభువుని శుభవచనం - 2 ||క్రీస్తేసుని ||
Verse 3
వర్షములోన వేసవిలోన పాడుడి
బాధలలోన సౌఖ్యములోన పాడుడి - 2
అలసట తీర్చెడి ఈ శుభవచనం
అమరుని శుభవచనం - 2 ||క్రీస్తేసుని ||