Verse 1
స్తుతి స్తోత్రమో ప్రభువా స్తుతి స్తోత్రమో ప్రభువా
కరుణాల హృదయా మరియ సుతా
Verse 2
అమలోద్భవి దయాసుతుడా - సదా నిన్నే స్తుతింతుమయా
ప్రపూజనీయు కీర్తనలూ - మదిలో ప్రభూ పాడెదము ||స్తుతి ||
Verse 3
జగమంతయు ఒకే హృదిగా - సదా నిన్నే స్తుతింతుమయా
సుధామృతాలు గ్రోలుమనీ - మదిలో ప్రభూ వేడెదము ||స్తుతి ||
Verse 4
మృదుభాషిత దయాసుతుడా - సదా నిన్నే స్తుతింతుమయా
కరుణా ప్రదాత నీ చరితం - హృదిలో ప్రభూ పాడెదమూ ||స్తుతి ||