Verse 1
ఎందుకయ్యా యేసయ్యా నన్ను ప్రేమించితివి
ఏమంచిలేని నన్ను పిలచితివి - నన్ను గాచితివి - నన్ను బ్రోచితివి ||ఎందు||
Verse 2
నేరము చేసిన వాడను - నెయ్యములేనివాడను
నేరములెంచని వాడా - నీతిమంతుడా
న్యాయవంతుడా - తీర్పు తీర్చువాడా ||ఎందు ||
Verse 3
మరణపు పాత్రుడనయ్యా - మది నెమ్మది లేనివాడనయ్యా
మరపురానిదేవా మార్పులేని ప్రభువా
కృప చూపించు నను క్షమియించు - నీ దాపున జేర్చుమయ్యా ||ఎందు ||