Verse 1
నీ ప్రియుడు యేసురాజు కోరెను నీ అందం
అతిత్వరలో రానైయున్నాడు ఏదీ నీ సౌందర్యం
వధువా! సంఘవధువా - వినుమా సిద్ధపడుమా - 2 || నీ ప్రియుడు ||
Verse 2
ఆనాటి వష్తి రాజాజ్ఞ మీరి - నేరస్తురాలాయెను
ఆత్మీయమైన ఎస్తేరు రూపము - రాజుకు ప్రియమాయెను - 2
యోగ్యమైన నీ జీవితమును - వరునికి కనపర్చుము - 2
సుగంధ పరిమళ సువాసనలతో - ప్రియుడేసుని చేరుము - 2 ||వధువా ||
Verse 3
కర్తవ్యమెరిగి కన్నీటితోనే - విజ్ఞాపనలు చేసెను
ఉపవాసముండి నశియించుచున్న - తన ప్రజల రక్షించెను - 2
ఈనాటి ప్రజల విమోచనముకై - నీవును విలపించుము - 2
శాశ్వత జీవపు ఆత్మలకొరకై కలసి ప్రార్ధించుము - నీవంతు చెల్లించుము ||వధు ||