Verse 1
క్రీస్తు మహిమకే మా ప్రాణం - మా జీవం - మా సర్వం
లోకము మరచి పాడెదము - స్తుతి గీతం కలకాలం
Verse 2
అడుగులు తడబడువేళ జారనీయక నిలిపి
ఇక్కట్టులో దరిచేరి వ్యథను తీర్చాడు
ఈ సామర్ధ్యమెవరికి లేదు - ధర ఎవరికి సాధ్యం కాదు
ఏది ఏమైనను నే యేసయ్యనే
స్తుతి గళమెత్తి మనసార భజియింతును ||చప్ప ||
Verse 3
ఆత్మీయ పోరాటమును నాకు నేర్పిన గురువు
పోరాడువాడు తానై జయమునిచ్చాడు
నాకు మెలకువ నేర్పువాడు ప్రార్ధనాయుధమును యిచ్చాడు
నాశనమవ్వని జీవకిరీటము నాకు తప్పక
బహుమతిగా అందించును ||చప్ప ||
Verse 4
చప్పట్లతో తాళాలతో నాట్యముతో కొనియాడెదం
తప్పెట్లతో భజనలతో శాంతి సువార్తను ప్రకటించెదం