Verse 1
యేసయ్యా .... నా జీవనాడివి నీవే
యేసయ్యా .... నా గుండెచప్పుడు నీవే
యేసయ్యా నీవే ప్రాణము - యేసయ్య నీవే జీవము - 2 ||యేసయ్యా ||
Verse 2
భయపడకుము నేను నీకు తోడైయున్నాను
దిగులుచెందకుము నేను నిను బలపరతునని
ధైర్యపరచితివి యేసయ్యా - దినదినము నన్ను దీవించితివయ్యా - 2
యేసయ్య నీవే ఆశ్రయం - యేసయ్యా నీవే అతిశయం - 2 ||యేసయ్యా ||
Verse 3
ఎందరిలో నేనున్న ఒంటరినే అయ్యా
అందరికన్న నాకు మిన్న నీవయ్యా - 2
ఎన్నికలేని నాపై నీవు - నీ ఎనలేని ప్రేమను చూపావు - 2
యేసయ్యా నిన్నే ప్రకటింతును-యేసయ్యా నీకై ఫలియింతును - 2 ||యేసయ్యా ||
Verse 4
నేనే నమ్మినవారే నన్ను మోసపరచినను
కావలసినవారే నాపై కాలుదువ్వినను
నమ్మకాన్ని వమ్ముకాకుండా - నా కొమ్ముకాచి దాచినావయ్యా - 2
యేసయ్యా నీవే మార్గము - యేసయ్యా నీవే గమ్యము - 2 ||యేసయ్యా ||