నేడు నేనేమైయున్నానో అది నీకృపయే గదా!
నేడు నీకృపలను తలంచి కృతజ్ఞత లర్పింతున్ - 2
నా పాపమెంతొ విస్తారం - నాపై నీ ప్రేమ అపారం
నీ ప్రేమను అత్యధికముగా - స్మరియింతును జీవితకాలం - 2 ||నిను ||
రక్షణ నిశ్చయముతో - పవిత్ర జీవితముతో
నీ పిలుపుకు లోబడి నేను - ఆత్మ శక్తితో సాగెదను - 2 ||నిను ||
అంతము వరకు సహించి - నావంతులో నేను నిలచి
నీచిత్తము నెరవేర్చుటయే - నా జీవిత ఆశయం - 2 ||నిను ||
నీ సజీవ సాక్షిని నేను - నీ సువార్త పత్రిక నేను
నీ రాయబారిని నేను ప్రభు - భూదిగంతములవరకు - 2 ||నిను ||
ఏమాత్రము జడియను నేను - నీ ప్రేమను చాటించుటకు
నా యాత్రను ముగించువరకు - నే వెళ్ళెద నీకొరకు - 2 ||నిను ||
నీవిచ్చిన పనిని ముగించి - సమస్తమును నెరవేర్చి
నీముందు నిలచువరకు - కృపనిమ్ము కృపామయుడా - 2 ||నిను ||
నిను ఆరాధింతునూ - నిను కీర్తింతునూ
నిను సేవింతునూ - నా యేసు రక్షకా - 2