Verse 1
స్తుతిపాత్రుడైన యేసయ్య - నిన్ను స్తుతించి కీర్తింతును
ప్రేమ స్వరూపి క్రీస్తు - నిన్ను ప్రేమించి ఆరాధింతున్ - 2
స్తుతియింతును - కీర్తింతును
ప్రేమింతును నిన్నే ఆరాధింతున్ - 2
Verse 2
సర్వశక్తిమంతుడైన నాదేవా-ఎల్షద్దాయ్ నిన్నే ఆరాధింతున్
ఎల్లప్పుడూ నాతో ఉంటానన్నదేవా ఇమ్మానుయేలని ఆరాధింతున్
Verse 3
నాకు అన్నింటిలో విజయమిచ్చేదేవా
యెహోవా నిస్సీ నిన్నే ఆరాధింతున్
స్వస్థపరచి నన్ను నడిపేదేవా
యెహోవా రాఫానిన్నే ఆరాధింతున్
Verse 4
ఎల్లప్పుడూ నన్ను కాచేదేవా - ఎల్రోయి నిన్నే ఆరాధింతున్
అన్ని వేళలో నన్ను ఆదుకొనేదేవా ఎబినేజరా నిన్నే ఆరాధింతున్