Verse 1
పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా
ఆత్మబలం మాకావశ్యమని - ప్రభువా నీవే తెలిపితివి
Verse 2
ఆరంభ దినములలో వలెనే - అద్భుతములీనాడు జరుగుటకు
ఆదివలే శుద్ధాత్ముడా - అమిత బలము నిమ్ము ||పరి ||
Verse 3
కృపావరములు ప్రజ్వలింప - వాక్యమునందు వేరు పారుటకు
కడవరి వర్షము పంపుమయా - సంఘమును మేల్కొల్ప ||పరి ||
Verse 4
లోకేచ్ఛలనుండి పారిపోవుటకు - సైతాను శక్తిని జయించుటకు
ధైర్యంతో నీ సేవ చేయుటకు - అభిషేకించుమయా ||పరి ||
Verse 5
యేసు సుబోధలు వివరించి - మాలో క్రీస్తుని పెంచుటకు
సర్వ సత్యములోనికి నడిపింప - ఆత్మ స్వరూపుడ రావయ్యా ||పరి ||