Verse 1
బలియైనావా మా కొఱకు
ఈ తులువల కొరకు కలువరి వరకు
తూలుచు... సోలుచు... చేరావా || బలియై ||
Verse 2
నీవెంటనుబడి నిను కొనియాడుచు నీచే మేలులు పొందినవారలు
అరచిరి నిను సిలువకు గొట్టుడనుచు-విడిచిరి నీ ప్రియ శిష్యులు కూడా ||బలియై ||
Verse 3
నీ నగుమోమున ఉమ్మిరి యూదులు - అరచేతుల చరచిరి రోమనులు
హేళనచేసిరి గేళిగ పేలిరి- బహు అవమానము పాలైనావా ||బలియై ||
Verse 4
శిరమున ముండ్ల మకుటము గ్రుచ్చి - కాల్జేతుల శీలలు దిగగొట్టి
నింగికి నేలకు నడుమగ నాథా - నిన్ను వ్రేలాడగదీసిరి గదా ||బలియై ||
Verse 5
బలియైనావా పాపులగావా - మరణించావా మృతినే గెల్వ
నీదరి జేరిన వారలకెల్ల - సాదర రక్షణ నొసగితి దేవా ||బలియై ||