Verse 1
సైన్యములకు అధిపతివి యెహోవా
సదా నిన్ను స్తుతియించెద
సృష్టి నిర్మాతవు నిత్యజీవము నీవు
సార్వభౌముడవై యుగములను ఏలే నిన్ను
Verse 2
మహిమలో దూత గణములు - 2
పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానప్రతిగానములు చేయున్
మంటినైన నేను నిన్ను స్తుతి చేసే భాగ్యమిచ్చిన - 2
నీ ప్రేమను ఏ రీతిని నే వర్ణించెదను నా స్వామి ||సుస్వరము ||
Verse 3
అవనిలో పాపజగతిలో - 2
అంధకార క్రియలన్నిటితో జీవమును సాగించుచు
ఘోరమైన ఉగ్రతకు పాత్రుడనై నేనుండగా
నీ కరుణతో నను క్షమియించి - రక్షణనిచ్చిన నా స్వామి ||సుస్వరము ||
Verse 4
సుస్వరములను తంత్రులజేసి నిను మది పొగడెదను
రాగ భావముల సక్రమ పరచి నిను ఘనపరచెదను