Verse 1
ఒక వ్యక్తిపట్ల నీ సంకల్పం బహు గొప్పది
ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగుచున్నది ||2||
Verse 2
గొర్రెల మందకు కాపరి - నమ్మకమైన మేపరి
సొంత ఇంటిలో కనిష్టుడు - నీ దృష్టిలో శ్రేష్టుడు
అందుకె అతనిని పిలిచావు - రాజుగా అభిషేకించావు
పశ్చాత్తాపమే ఔషధమంటూ - శుద్ధుల సంఖ్యలో నిలిపావు
దావీదును ధన్యునిచేశావు. ||ఒక ||
Verse 3
చిన్న నాడెకలకన్నాడు - అన్నలతో అది చెప్పాడు
కలలు కనేవాడన్నారు - అన్యులకు అమ్మేసారు
నిందలు శ్రమలు సహించాడు - అందరిలో ఘనుడయ్యాడు
ఫరోకలలకు భావమువిప్పి - సింహాసనమెక్కించావు
యోసేపును ధన్యునిచేశావు
హితవు - హెచ్చరిక ||ఒక ||
Verse 4
ఎన్ని అడ్డులు వచ్చినా యెన్నటికీ అధిమారనిది ||2||
అన్నిటిని దాటి నీ చిత్తమే నెరవేరునది నీ చిత్తమే నెరవేరునది