Verse 1
దారి తప్పిన మానవుండా నీదారి ఏదో తెలుసుకో
Verse 2
నీటి బుడగ వంటి బ్రతుకు - నిజము కాదని తెలుసుకో
తెలుసుకొని నీ జీవితమును - పరమునకు నీవు మలచుకో ||దారి ||
Verse 3
గమ్యములు రెండున్నవి - నీవు ముందుగానే తెలుసుకో
పరము నరకము వున్నదనుచూ - సత్యమును గ్రహించుకో ||దారి ||
Verse 4
చీకు చింత భయము వీడి - రక్షకుని నీవు చేర్చుకో
పరమ రక్షకుడేసు ప్రభువని - ఆత్మద్వారా తెలుసుకో ||దారి ||