Verse 1
రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసును చేరుడి
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్
Verse 2
శ్రీయేసు కాంతిలో నిలిచి - సాగించు జీవిత యాత్ర
బాధలన్నిటిని బాపున్ - భజియించు యేసుని నామం ||హల్లెలూయ ||
Verse 3
విలువైన నీ జీవితమున్ - వెలిగించుము ప్రభుకొరకు - 2
పరిశుద్ధ ఆత్మను పొంది - ప్రభు వాక్యము ప్రచురించు ||హల్లెలూయ ||
Verse 4
మరణము జయించి లేచెన్ - మరణపు ముల్లును విరిచెన్ - 2
మధురము యేసుని నామం - మరువకు యేసునిధ్యానం ||హల్లెలూయ ||