Verse 1
నీ వాక్య సారాంశం - సత్యము దేవా
నీవాక్యమే నిత్యం - నిలచును దేవా
Verse 2
బలమైన నీ వాక్యం - బ్రతికించే జీవాహారము
కలిగించు నాకదియే - నా బాధలో నెమ్మది
వెలిగించు నీ వాక్యం తొలగించు నా చీకటి
చూపించున్ నీ మార్గం నా పాదములకు దీపమై ||నీ వాక్య ||
Verse 3
ప్రభావం గల వాక్యం - ప్రవేశించు ప్రతివారిలో
స్వస్థపరచున్ శుద్ధిచేయున్ - హృదయములను మార్చును
నీ వాక్యం వాడియైన రెండంచుల ఖడ్గం
శోధించున్ ప్రాణాత్మల్ ఓడించు అపవాదిని
యేసు జనన గీతాలు