ఇది క్రీస్తు ప్రేమ సందేశం విను - పరలోకపురికి ఇదె మార్గం కను
యేసే నా రక్షకుడని అను - పాపరోగి ఔషధమిదె కొను కొను నేడేకొను
నేరమందు పట్టబడిన జారస్త్రీని తెచ్చి
రాళ్ళుకొట్టి చంపాలని యేసుముందు పెట్టినా
పాపికాని వాడెవడో రాయి ముందు వేయమని
పాపమింక చేయొద్దని పాపిని క్షమియించినట్టి ||ఇది క్రీస్తు ||
ఆచారములు నిన్ను విమోచింపలేవు
తిధులు తీర్థయాత్రలు రక్షింపరావు
అదిగో యేసు చిందించిన సిలువ రుధిరము
మానవాళి మనుగడకై అదే విజయము ||ఇది క్రీస్తు ||
అన్ని వ్యాధులకంటే మూల వ్యాధి పాపం
యేసే ఈ లోకానికి సర్వపాప పరిహారం
నాకే కలదన్నాడు క్షమాపణ అధికారం
నీ ఆత్మ రక్షణకై నేడే చుట్టు శ్రీకారం ||ఇది క్రీస్తు ||
నమ్మి బాప్తిస్మమొందితే పరలోకం సిద్ధం
నమ్మనొల్లని వానికి నరకమే తధ్యం
శిష్టుల రక్షించేది లోకనానుడి
దుష్టుల రక్షించేదే క్రీస్తు ప్రేమిది
పద్యం: దైవమానవ మైత్రిని ధరకూర్చినట్టి దైవసుతుడు
ఖలుల మతుల మార్చి బల్ వెల్గులిచ్చిన పూజనీయుడు
దురిత నరులకై నలిగి పరలోకమిచ్చిన పరమ ప్రభుడు
మరణతుల్యుడనైన నన్ను మనిషిగా నిలిపిన మహోన్నతుండు