Verse 1
శ్రమదినమున కృంగితే చేతకాని వాడవగుదువు
శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు || శ్రమ ||
Verse 2
శ్రమనొందియుండుట మేలాయె నాకు
శ్రమ కలుగక మునుపు నే దారితొలగితి - 2
శ్రమలలో బలపడితిని శ్రమలలో స్థిరపడితిని
శ్రమలు పొంది దైవరాజ్య వారసత్వ మొందితిని ||శ్రమ ||
Verse 3
క్రీస్తునందు సద్భక్తితో బ్రతునెంచువారు
లోకమందు పలుహింసలు అనుభవించిన - 2
దుర్జనులు వంచకులు అంతకంతకూ
మోసపరచి ఆశదీర నాశనాన కూలుదురు ||శ్రమ ||
Verse 4
శ్రమ ఫలమును పొందుటకే సహించుము
శ్రమలయందు దేవుని ప్రియపుత్రులము - 2
శ్రమలులేక పవిత్రతలో పాలుపొందలేము
శ్రమలయందే సమాధాన ఫలము పొందగలము ||శ్రమ ||