Verse 1
నీ కృప నాకు చాలయ్య నా యేసయ్యా
నీ కృపలను తలపోయుచూ జీవించెదనయ్యా - 2
కష్టంలోనైనా కలిమిలోనైనా - శోధనలోనైనా సౌఖ్యంలోనైనా - 2
యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీవెంటే నేనయ్యా - 2
Verse 2
వేలకొలది వెండిబంగారు నాణెములకంటె - నీ వాక్యమే నాకు విలువైనది
విస్తారమైన సిరిసంపదల కంటె - నీ సేవయే నాకు ఘనమైనది - 2
ఆత్మల భారముతో - ఆత్మాభిషేకముతో - 2
అంతము వరకు నీ సేవలో సాగెదన్ - 2 ||యేసయ్య ||
Verse 3
నీ సంఘక్షేమమే నా ప్రాణము అది నాకు ఎంతో భాగ్యము
నీ సేవకొరకే ఈ జీవితం కరువైన బరువైన నీకంకితం - 2
లెక్కను అప్పగించే ఆ శుభ తరుణంలో - 2
నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపే చాలు - 2 ||యేసయ్య ||