Verse 1
కుహూ కుహూ అంటూ పాడే ఓ కోయిలా
కమ్మనైన స్తుతి గీతమునే నువ్వు పాడగా
నేను కూడ స్వరము కలిపెద నాట్యముతో స్తుతులు పాడెద
చిన్నారుల మనసంటే యిష్టమన్న యేసుని గూర్చి
పొన్నారుల మాటలంటే ముచ్చటన్న దేవుని గూర్చి
Verse 2
కొక్కొరొకోయని కూసే కోడిపుంజా
వేకువనే మమ్ము మేలుకొలుపుతూ
స్తుతులను నువ్వు పాడగా ||నేను ||
Verse 3
కిచకిచమని పాడుచుఎగిరే చిన్ని పిచ్చుకా
ఉల్లసించే గీతాలతో
స్తుతులను నువ్వు పాడగా ||నేను ||