Verse 1
యువతులారా కూడి రండి ఆలకించండి
స్త్రీలారా నేడు మీరు ఆలోచించండి
దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి
Verse 2
దేవుని యెడల భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గదా
అట్టి స్త్రీయే జ్ఞానము గలదై తన గృహమును కట్టును
పరిశుద్ధతయే తన సౌందర్యము విధేయతయే తన ఆభరణము
వాక్యమే తన ఆయుధము ప్రార్ధనే తనకున్న బలము ||యువతులారా ||
Verse 3
జాతిని రక్షించ సాహసించెను రాణి ఎస్తేరు
కన్యమరియ జనని ఆయె లోక రక్షకునికి
విశ్వసించిన వేశ్యరాహాబు యింటి వారినే రక్షించెను గదా
హృదయము తెరచిన లూదియా గృహము సంఘమాయె గదా ||యువతులారా ||
Verse 4
సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై
సంఘసమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి
యేసురాజ్య స్థాపన చేయ యేసుతో కలిసి పోరును సలుప
వీరులను యోధులను స్త్రీలే పంపాలి
సంపదను సంతతిని అర్పణ చేయాలి ||యువతులారా ||