మనస యేసు మరణ బాధ – లెనసి పడవే
తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే
నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస||
అచ్చి పాపములను బాప – వచ్చినాడట
వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున
తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస||
ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు
న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్
ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస||