Verse 1
యేసు దేవునే నమ్ముకోండయ్యా - ఓహో యేసు దేవునే నమ్ముకోండమ్మా
మన శాపము కొరకై సిలువను మోసి - కలువరి గిరిలో రక్తము కార్చి
ప్రాణమునే బలిదానము చేసి - మృత్యుంజయుడై తిరిగి లేచిన
Verse 2
కఠిన జనులపై కరుణ చూపిన - కలతజీవులకు హితవుచెప్పిన - 2
బ్రతుకుబాటగా వెలుగు తెచ్చిన - నిత్యజీవము నీకు ఇచ్చిన ||యేసు ||
Verse 3
బండలవంటి బంధిపోటుల - గుండెలనుండి విషం పిండిన - 2
దండియైన దీవెనలు నింపుతూ - నిండు మనిషిగా తీర్చిదిద్దే ||యేసు ||
Verse 4
ఎండ వేళలో మేఘ స్థంభమై - చీకటివేళల అగ్ని స్థంభమై - 2
అన్నివేళలా అండ జూపుతూ - కొండవోలె నీకుండాననిన ||యేసు ||