Verse 1
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ...ఆ...ఆ... ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ...ఆ...ఆ... ఎంతో ఘనమైనది || యెహోవా ||
Verse 2
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
Verse 3
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
Verse 4
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
Verse 5
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
Verse 6
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||