Verse 1
తేజోమయా మారక్షకా నిన్ను స్తుతియింతుమో దేవా - 2
గాఢాంధకారములో పడియుండగా ప్రేమతోపిలిచి రక్షించితివే - 2
Verse 2
ముందుగా నీవు నిర్ణయించితివీ వక్రప్రజల మధ్య నుండి పైకి లేపితివే
నీవెలుగుతో మమ్ము నింపితివీ నీసాక్షిగా ఇలనిలిపితివే ||యేసయ్యా ||
Verse 3
ఉన్నవాడనన్నవాడవూ మాతోనీవు ఉండువాడవూ
ఫలములతో వరములతో నింపితివీ నీశక్తితో మమ్ము నింపితివే ||యేసయ్యా ||
Verse 4
యేసయ్యా యేసయ్యా నీవే మారక్షణయా
యేసయ్యా యేసయ్యా నీవే మా వెలుగువయ్యా