Verse 1
యేసుప్రభు స్థాపిస్తాడు - క్రొత్తరాజ్యము
మోక్షరాజ్యము - అది శాంతిరాజ్యము
యేసుప్రభు రాజుగా వుంటాడచ్చట
మనమంతా రాజ్యంలో పాలొందుదము || యేసుప్రభు ||
Verse 2
ఆ రాజ్యము పేరే - నూతన యెరుషలేమండి
దాని పునాదులు - పలువిధమైన రత్నాలేనండి
పరిశుద్ధులకు ఆ రాజ్యం సొంత సొత్తండి ||మనమంతా ||
Verse 3
ఆయన తన ప్రజలందరిమధ్య కాపురముండును
తనప్రజ కన్నుల బాష్పబిందువు తుడిచివేయును
దుఃఖము ఉండదు వేదన ఉండదు నిత్యం సంతోషం ||మనమంతా ||
Verse 4
ఆ రాజ్యంలో పగలు రాత్రి లేనేలేవండి
సూర్యుడు చంద్రుడు ఎన్నడుకూడా కనబడవచటండి
ఆయన వెలుగే నిత్యము అచట ప్రభవిస్తుందండి ||మనమంతా ||
Verse 5
ఆరాజ్యములో జీవజలనది ప్రవహిస్తుందండి
ఆ నదిఒడ్డున జీవ వృక్షాలెన్నో కలవండి
వాటి ఆకుల వలన జనులు స్వస్థత నొందుదురు ||మనమంతా ||