Verse 1
నీప్రేమ ఆకాశముకంటె ఎత్తైనది - నీనామము అపరంజి కంటె విలువైనది
నీవు నాకోసం దాచిన మేలులెంతో గొప్పవి - నీవిచ్చిన రక్షణభాగ్యం పరమునకేమార్గము
సిలువలోన చేసిన త్యాగం - లోకాన ఎవ్వరు చేయలేనిది
Verse 2
గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరు మేలు - నీతితోకూడిన కొంచెమే మేలు - 2
ఘనతముందు వినయముండును - కీడుముందు గర్వము నడుచును
నీతిమంతుల ప్రార్థనె నిత్యము నీవు - ఆలకింతువు ||నీ ప్రేమ ||
Verse 3
ఒకని నడతలన్నియు వానికి నిర్ధోషములే
గుర్తించకపోతే అదియే నాశనముకు మార్గము -2
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతమే శ్రేష్టం - పాపానికి వచ్చుజీతం మరణమే తధ్యము
పాపాత్ములు ప్రేరేపించగ లొంగిపోక నన్ను - నిలువ బెట్టుము ||నీ ప్రేమ ||