పాపికి ఆశ్రయుడేసు రక్షుకుడు - భువిలో బలిగా మరణించెనే
పరిశుద్ధుడు పాపమాయెనే - భారమైన సిలువను మోసెనే ||2||
పట్టి యిచ్చెను ముప్పది వెండి - నాణెములకై ప్రభుయేసుని
హత్యచేయుటకు కొనిపోయిరే - గొల్గొత గిరికి యేసుని || పాపికి || ||2 ||
కాలు చేతులలో మేకులు కొట్టి - ముండ్లతో కిరీటమల్లి పెట్టగా
రక్తధారలతో వ్రేలాడెడు - ప్రభునికాంచు హృదయము సహించునా ||పాపికి ||
పాపశాపములు తీరని వ్యాధుల్ - నీదు జీవితపు శోధనలన్గాంచి
ఏలదుఃఖపడెదవు - ప్రభుయేసు నొద్దకు పరుగిడిరా ||పాపికి ||
నమ్మి రక్షణ మీరు పొందిన - మీదు జీవితమెమారును
గాంచి దూతలు పరమందు - స్తుతిగానములు చేయుదురు ||పాపికి ||
అంతము వరకు మీరు నిలచిన - అంత్యదూతబూర ఊదగా
మధ్యాకాశమునకు ఏగియే - ప్రియుని కాంచు మహిమ దేహులై ||పాపికి ||
రాజాధిరాజు యేసుడు - ప్రభువుల ప్రభువు దేవుడు
మనమంత యాజకులుగా - వెయ్యేండ్ల రాజ్యము ఏలెదం ||పాపికి ||