Verse 1
దీనదయాళుడా యేసుప్రభూ - నా స్తుతులను నీకు అర్పింతును
అర్పింతునూ .... అర్పింతునూ ....
హృదయమార నా స్తుతులను అర్పింతును
Verse 2
(నా) హృదయ పీఠమే కోరితివి - సిలువ బలిపీఠముపై ప్రాణమిడితివి ...
వ్యోమ పీఠుడవైన నీవే - నా మదిలో వశించుట అద్భుతమే -2 ||దీన ||
Verse 3
(నీ) నిత్యజీవమే నాలో నింపితివే - నిత్యమైన మరణమునుండి తప్పించితివే ...
పునరుత్థానుడవు నీవే - నీవు మరణము బాపిన జయశాలివే ||దీన ||
Verse 4
(నా) స్తుతికి పాత్రుడా పూజనీయుడా - మహనీయుడా మహిమాన్వితుడా
సర్వోన్నతుడవు నీవే - నా సర్వము నీకే అర్పితము ||దీన ||