Verse 1
ఆశీర్వదించుము దేవా - ఆదరణ నీవే ప్రభువా
అనుదినము నీ కృపయే చాలు - అనుక్షణము నీకే మాస్తుతులు
Verse 2
ఆపత్కాలములో సహాయకుడవు నీవు
అందరిని ప్రేమించే యేసునాధుడవు - 2
ఆశ్రయ దుర్గము నీవే ఆనందతైలము నీవే - 2
ఐశ్వర్యము నీవే మా ఘనతవు నీవే - 2 ||ఆశీర్వ ||
Verse 3
నీ యందు భయభక్తులు గల వారి యెడల
దయ చూపు చున్నావు తరతరముల వరకు - 2
నీ యందు భయభక్తులు గల వారి పిల్లలు - 2
నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు - 2 ||ఆశీర్వ ||
Verse 4
తొట్రిల్ల నియ్యవు మా పాదములను
తోడై నీడై మాత్రోవకు వెలుగై
కాపాడు చున్నావు కనుపాపవలెను - 2
కడవరకు విడవకను నడిపించెదవు - 2 ||ఆశీర్వ ||