Verse 1
ప్రతిచోట నీ సాక్షిగా నీ ఘన క్రియలను చాటాలని
ప్రజలెదుట నీ మాటగా కలువరి ప్రేమను పాడాలని
నిలిచియుంటిమి నీ వారిగా - నీవు పిలిచిన పనివారిగా ||2||
ఇది నీవు మాకు నడచి చూపిన - చక్కని మార్గమే
Verse 2
వ్యాధులైనా బాధలైనా - శోధనలైనా రోదనలైనా
నీవే అండగా మాతోనుండగా
నిండుగా పండించెదము ఆత్మపంట మెండుగా ||ప్రతి|| ||2 ||
Verse 3
శాసనమైనా దూషణలైనా - హింసలూ అవమానములైనా
నీవే ఉండగా - భయమే లేదుగా
నిండుగా వెలిగించెదము - ప్రేమ జ్యోతి మెండుగా ||ప్రతి ||