Verse 1
నీ కృప జీవము కంటె ఉత్తమమైనది - నీ ప్రేమ తరతరముల వరకు నిలచును
మారిపోనిది మధురమైనది - వీడిపోనిది వింతయైనది - 2
ప్రవహించు చున్నది - కలువరి నుండి ఖలుని వరకు
Verse 2
నీవులేని జీవం నిర్జీవమేగా - నీవులేని స్వర్గం నరకమే కదా - 2
యేసూ..... నీకన్నా ఎవరు నాకు - నే నీసొంతము
యేసూ..... నీవున్నచోటే స్వర్గం - నీవే చాలును
నే నీ సొంతము - నీవే చాలును - 2 ||నీ కృప ||
Verse 3
నీవులేని కట్టడం ఆలయమౌనా
నీవులేని జీవితం ధన్యమౌనా
యేసూ..... నీవుంటే చాలు - లేమైనా కలిమే కదా
యేసూ..... నా కాపరి నీవే - నాకు కొదువే లేదు
నా కలిమి నీవే - నా కాపరి నీవే - 2 ||నీ కృప ||