Verse 1
జీవా - నీవికలేవే - వేళాయెను - మేలుకొనవే
Verse 2
ప్రాతఃకాల మాయెనే - పలు జీవులు ప్రస్తుతించుచుండెనే
ప్రాతఃకాలమున నీ - ప్రభు యేసుని సేవింపనే ||జీవా ||
Verse 3
ఖగచరములు లేచెనే - కడు మోదమలరగ కూసెనే
ఖగచరాచర కర్తను - నీ కలలోనైన మరువకే ||జీవా ||
Verse 4
శోధనా గాధలయందున - ప్రభుని సేవింపవే
శోధన బాపెడి యేసూ - చోద్యంబుగ జయమిచ్చునే ||జీవా ||