Verse 1
మలినమే అంటని చిట్టి చేతులతో
చప్పట్లు కొడితే యేసు చూడకుండునా
Verse 2
కపటమే లేని చిన్ని హృదయముతో
విజ్ఞాపన చేస్తే యేసు వినకుండునా
Verse 3
అబద్ధాలు ఆడనట్టి చిన్ని నాలుకతో
హల్లెలూయ పాడితే యేసు మురియకుండునా
Verse 4
ఆకసమున దూతగణము ఆనందోత్సాహముతో
స్వరములన్ని ఐక్యపరచి వంతపాడకుండునా