Verse 1
పశువుల పాకలో వెలసిన దేవా
వసుధకు వెలుగును నొసగితివయా - 2
అసువులు బాసిన ఈలోకమును
కుశలమునడుగను వసియించితివా ! || పశువుల ||
Verse 2
గొల్లలు జ్ఞానులు ఎల్లరుచేరి
ఆరాధించిరి ఆత్మతో నిన్ను - 2
ఆత్మ స్వరూపుడా ఆరాధింతును
ఆనందముతో కీర్తించెదను - 3 ||పశువుల ||
Verse 3
ఇలలో జనులు ఎల్లరుచేరి
నీ జీవమునే వేడుక చేసి - 2
క్రిస్మస్ దీవెన కుమ్మరించుము
అభిషేకమును ఒసగుము దేవా - 3 ||పశువుల ||
Verse 4
సర్వ లోక దేవతలు
సప్త స్వరములతో సరిగమపదని
స్వరములు పాడిరా - 2
సర్వోన్నతుని మహిమయనుచు
స్తుతి స్తోత్రములతో ఆరాధించిరి - 3 ||పశువుల ||