Verse 1
జీవితం ... ఈ జీవితం - నీవిచ్చిన బహుమానం
ఈ ..... జీవితం ..... నా జీవితం - నీ ..... విచ్చిన బహుమానం
Verse 2
జీవ ప్రదాతవు నీవే దేవా - జీవిత సారధి నీవే ... (యేసు)
జీవితమునకు విలువ తెచ్చితివే - జీవము దానము చేసి ... (నీ)
రక్తము నాకై కార్చి ..... ||జీవితం ||
Verse 3
నిమిషమాత్రపు మనిషిని నేను - నిత్యత్వము నిచ్చితివే (నాకు)
ప్రభుయేసునందు విశ్వాసమెగా - నిత్యజీవ వరమాయే (నే)
నిరతము జీవింప నీలో ||జీవితం ||
Verse 4
ప్రతిదినము ఒక అవకాశముగా - నీ కొరకే జీవింప యేసు
ప్రతిక్షణము నను బలముతో నింపే - ప్రభుయేసు నీ కృపయే (నీదు)
మారని వాత్సల్యతయే ||జీవితం ||
Verse 5
శ్రమభరితం నా స్వల్పజీవితం - కలదు సుఖము యుగయుగములు నీతో
కలత చెందనిక కాంక్షించెదను - త్వరలో నిను చేరుటకు (ఆ)
పరమున నిను చూచుటకు ||జీవితం ||