Verse 1
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
నీ దీవెనా నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||
Verse 2
నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా||
Verse 3
ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా||
Verse 4
కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
నీ సువార్తను నే చాటెదను (2)
ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||