Verse 1
స్తుతియింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము - యేసయ్య - 2
నీవే నీవే నీవే నా ఆధారము - నీవున్న చాలు నాకు ఆనందము
Verse 2
మరణ సమయము వరకు - మరువక నిన్ను స్తుతియించెద
మనుజావతార నా యేసురాజా - 2
మమ్ము మరువని త్రియేక దేవా - 2 ||స్తుతి ||
Verse 3
పర్వతాలు తొలగినను - మెట్టలు తత్తరిల్లినను
వీడిపోని నీ శాశ్వత కృప - నాకిలచాలును ఓ యేసుదేవా - 2
నాకదే మేలు ఓ క్రీస్తు నాధా - 2 ||స్తుతి ||
Verse 4
నిన్ను చేరు కాలము వరకు - నిరీక్షణే మా కాధారము
నీలి మేఘము పైన విందులో - 2
వధువు సంఘముగా మేము ఉందుము - 2 ||స్తుతి ||