Verse 1
పగలనక రేయనక ఎండనక వాననక
ఊరనక వాడనక గుట్టనక మెట్టనక
పగలనక రేయనక నిద్రాహారాలన్ని మాని
ప్రకటించే సువార్త అంటే అలుసా?
యేసు పరిశుద్ధ జీవిత చరిత తెలుసా?
గళమెత్తి వినిపించేది స్వరమెత్తి కీర్తించేది
ప్రతిసారి ప్రార్ధించేది బాకాలు మ్రోగించేది
పరిశుద్ధ గ్రంథమునెత్తి ఎల్లవేళలా చాటించేది
Verse 2
యెహోవాయే యేసయ్యగా రూపం దాల్చింది
ప్రాణమునే కలువరిలో దానం చేసింది
అవమానమును పొందింది - అపహాస్యమును మోసింది ||నీ ఆత్మ ||
Verse 3
నిందలను బాధలను ఓరిమితో ఓర్చింది
నిలువెల్లా గాయాలతో రక్తము కార్చింది
కడుదీనుడై వచ్చింది కలువరిలో బలిఅయినది ||నీ ఆత్మ ||
Verse 4
మృతినొందె అంతగా వేదన నొందింది
తలపై ముండ్ల మకుటమును కృపతో ధరియించింది
పాపాన్ని తుడిచేసింది మరణాన్ని హతమార్చింది ||నీ ఆత్మ ||
Verse 5
నీ ఆత్మ రక్షణ కొరకే తెలుసా - నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా