Verse 1
నీతి న్యాయములు గలచోట - సత్యం పలుకును ప్రతినోట
పరవశమొందుచు ఆలపించుము - స్తుతిస్తోత్రములను ఈపూట
కృపలను గూర్చిన స్తుతిపాట - 2
గమపా పాపా పమనిపగా గామాగాసా నిసగమపా
గమపనిసా సనిపమగా గామాగాసా నిసగమపా - 2
Verse 2
ధూప దీప నైవేద్యములను - ఆస్వాదించడు మన ప్రభుడు
స్తుతులతో వేసిన సింహాసనమున - ఆసీనుడగును ఘన విభుడు
మన ప్రభుడు - ఘన విభుడు - మన ఘనస్తుతులకు కారకుడు ||నీతి ||
Verse 3
పాపశాప భారమంతటిని - తొలగించిన విమోచకుడు
మరణపు ముల్లును విరిచివేసిన - అభిషిక్తుడైన రక్షకుడు
రక్షకుడు - విమోచకుడు - మన ఘనస్తుతులకు కారకుడు ||నీతి ||