Verse 1
నీవే నాకు జీవాధారం వీడను నీ సన్నిధీ యేసు నీవే నా పెన్నిధీ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా పాడెదన్ నీ కృపనే వేడెదన్
Verse 2
అపరాధములలో చచ్చియుండగా - నన్ను బ్రతికించిన దివ్యకృప
అపవాది పడద్రోయ నెంచినా - నిలువబెట్టినది నీ కృపా మహాకృపా ||నీవే ||
Verse 3
కలవరములను బాపే నీ కృప - కరుణామయుడా కన్న కృపా
శత్రువులను స్నేహితులను చేసే- చిత్రమైన పవిత్రకృపా మహాకృపా ||నీవే ||
Verse 4
నా కృప నీకు చాలునంటివి - నీ కృపయందే నాకు బలం
నేనేమైనా నీ కృపయే కదా - నిత్యము నను నడిపించు కృప మహాకృపా ||నీవే ||