పాపములో పండిపోయి - శాపముతో నిండిపోయి
మలినమైన నేటి సమాజం - నాశనాన జోగుచుండగా
(సేవకుడా) సోదరుడా చూస్తున్నావా - ఆలోచన చేస్తున్నావా - 2 || పాపం ||
పరలోక సంబంధమైన పిలుపులో - పాలొందిన పరిశుద్ధ జీవులను
విడిపించుటకై నడిపించుటకై - 2
ఎన్నుకున్న యేసు నీకు తోడు - నిత్యము నిన్ను నడుపుతాడు
సోదరుడా గుర్తించావా - నీ లక్ష్యము సాధిస్తావా ||పాపం ||
హత్యలు ఆత్మ హత్యలు - వ్యాధులు నేటి మరణ కారణాలు
హద్దులేని ఆశయాలతో - బలౌతున్న జీవితాలను
ఆపుటకై - కాపాడుటకై
ఆత్మశక్తికై ప్రభుని వేేడు - విజయ పథములో పోరాడు - 2
సైనికుడా కనుగొన్నావా - పోరాటము సాగిస్తావా ||పాపం ||
యోగ్యమైన ఈ పరిచర్యలో - సిగ్గుపడని దేవుని పనివానిగా
సత్య వాక్య అధికారముతో - సిద్ధపడిన దైవజనుడివై - 2
ప్రబోధించుము - పండించుము
ఆత్మలనే పంటకోయుము - శ్రేష్టమైన బహుమానము నొందుము
స్నేహితుడా వెనుదీయకుము - కర్తవ్యమును మరచిపోకుము - 2 ||పాపం ||