Verse 1
యేసుక్రీస్తు ఈ జగాన సాటిలేని దైవము
ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము
Verse 2
ఎంత ఘోర పాపినైన - ప్రేమతో క్షమించును
మంచి వాని దాపు చేరి మేలుకలుగజేయును
దారి యేది కానరాని - దీనులైన వారిని
జాలితోను ఆదరించి - కాపాడు దేవుడు ||యేసుక్రీస్తు ||
Verse 3
యేసులేక ఎవ్వడైన చేరలేడు మోక్షము
యేసులేని జీవితాన తీరలేని వేదన
యేసు ఉన్నవారి గృహము ఆనంద నిలయము
యేసు స్వామి ఎవరినైన దీవించు దేవుడు ||యేసుక్రీస్తు ||