Verse 1
ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే - నా యెడ కృపాబాహుళ్యమే
Verse 2
సంగీతములాయె - పెనుతుఫానులన్నియు
సమసిపోయెలె నీ నామ స్మరణలో సంతసమొందెను నామది ఎంతో ||ప్రభువా ||
Verse 3
పాపనియమమును బహు దూరముగాజేసి
పావన ఆత్మతో పాలించితివి - ప్రభువా నిన్ను స్తుతియింతును ||ప్రభువా ||
Verse 4
నీలో దాగినది కృప సంపన్నముగాను
నీలో నిలచి కృపలనుభవించి - నీతో నే యుగయుగములు నిల్తును ||ప్రభువా ||