Verse 1
ఉజ్జీవం కోరవా విశ్వాసి నిర్జీవ పాత్రగా మిగిలెదవా
కోరుము పోరాడుము పొందుము ఉజ్జీవము ఉజ్జీవము ఉజ్జీవము
Verse 2
లోకమును తలక్రిందులు చేసిన వారేరి
ఆకాశము నుండి అగ్ని దింపిన వారేరి
గెత్సెమనె తోటలో రోధించిన వారేరి
పెంతెకోస్తు శక్తిని అందుకున్న వారేరి ||ఉజ్జీవం ||
Verse 3
ఆత్మలో అగ్ని వంటి వేదన నొందాలి
బలము పొంది ప్రతి శోధన జయించాలి
పై నుండి శక్తినే అనుభవించాలి
పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవాలి ||ఉజ్జీవం ||
Verse 4
యోధుడవై ధరియించుము సర్వాంగ కవచము
చేయుము నీ దేహమును సిలువ యాగము
వాక్యమే కావాలి నీ అన్న పానం
ప్రవహించాలి నీలో ఈ జీవజలం ||ఉజ్జీవం ||